మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆచార్య’ లో కూడా ఓ పాత్ర చేస్తున్నాడు. అయితే రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ను తాజాగా విడుదల చేసింది. చిత్రబృందం. ‘లాహి లాహి… అనే ఫస్ట్ సింగిల్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలో చరణ్ ”సిద్ధ” పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండడం చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ ఏడాది మే 13న ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలసి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఆచార్య చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
previous post
next post
కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ రాదు: ప్రకాశ్ రాజ్