telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో మళ్ళీ గందరగోళం…

కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో మళ్ళీ గందరగోళం మొదలైనట్లు తెలుస్తుంది. లిబర్టీ స్టీల్స్ తో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం  పక్కన పెట్టింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ లిబర్టీ స్టీల్సుతో కలిసి కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పెండింగులో పెట్టామని లిబర్టీ స్టీల్స్ కంపెనీ ఆర్ధిక పరిస్థితి సరిగా లేదని అన్నారు. లిబర్టీ స్టీల్సుకు ఫండింగ్ చేసే సంస్థలు దివాళా తీశాయి.. ఆ ప్రభావం లిబర్టీ స్టీల్స్ మీద పడిందని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో లిబర్టీ స్టీల్స్ ఆర్ధిక పరిస్థితి సహకరించదని భావిస్తున్నామన్న ఆయన ఎల్-2గా వచ్చిన కంపెనీని పరిగణనలోకి తీసుకోవాలా..? ప్రభుత్వమే చేపట్టాలా..? అనే అంశంపై చర్చిస్తున్నామని అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ప్లాన్-బి అమలు చేస్తామని ఏపీలోని పెద్ద, మధ్య తరహా పరిశ్రమలకు సుమారు రూ. 1000 కోట్ల ప్రొత్సాహాకాలు ఇస్తామని అన్నారు. ఎంఎస్ఎంఈలకు రూ. 300 కోట్ల ప్రొత్సహాకాలు ఇస్తున్నామని ఏప్రిల్ 2వ తేదీన ఐటీ వర్క్ షాప్ నిర్వహిస్తున్నామని అన్నారు.

Related posts