భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం సాధించింది. మొత్తం 12 రౌండ్లుగా జరిగిన ఈ మెగాటోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ హంపీ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని చాంపియన్‌గా అవతరించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా చరిత్రకెక్కింది. మొత్తం రౌండ్లు ముగిసేసరికి లీ తింగ్‌జీ (చైనా), అట్లికా ఎక్తెరీనా (రష్యా)తో కలిసి హంపీ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన టైబ్రేక్‌లో మెరుగైన స్కోరు సాధించడంతో హంపీకి స్వర్ణం దక్కింది.
previous post