కరోనా వైరస్ కట్టడిలో భాగంగా తమ వంతు సాయాన్ని ప్రకటించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. కరోనా మహమ్మారిపై భారత్ పోరులో భాగంగా రూ. 30 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మొత్తాన్ని కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోమవారం తన అధికారిక ట్వీటర్ అకౌంట్‌లో విరాళం విషయాన్ని స్పష్టం చేసింది. విషయం తెలిసిన ఎస్‌ఆర్‌హెచ్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా కరోనా నివారణ చర్యల్లో భాగంగా రూ. 10 కోట్లను సన్‌రైజర్స్ విరాళంగా ఇచ్చింది. ఇక ‘కరోనా సెకండ్‌వేవ్ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా ఉండేందుకు సన్ టీవీ నెట్‌వర్క్ రూ. 30 కోట్లను విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతున్న వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను ఉపయోగించనున్నాం. ఆక్సీజన్ సిలిండర్లు, మెడిసిన్ సరఫరా నిమిత్తం ఎన్జీఓలతో భాగస్వామ్యమై ముందుకు సాగుతాం అని పేర్కొంది.
previous post
పాఠశాల అపహాస్యమైతే విద్య నిరర్థకము!