telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

లాక్ డౌన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వలదే…

kishanreddy on ap capital

ప్రపంచంలో కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత దేశం ముందు ఉంది అని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలి. ఆక్సిజన్, మెడిసిన్,కోరత తగ్గించుకోవడానికి ఐదువందల కంపెనీలు తయారులో చాలెంజ్ గా పని చేస్తున్నాయి. మెడిసిన్ రెమెడిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాం. భారత దేశం విదేశాల మంచి సంబంధాలు కలిగి ఉన్నాయో వారితో మాట్లాడి ప్రధాని సహాయం తీసుకుంటూన్నాం. లాక్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వలదే బాధ్యత అని కేంద్ర చేప్పింది. ప్రపంచ దేశాల లో రికవరీ ఎక్కువ మన దేశంలో ఉన్నది. ఆక్సిజన్ కోరత లేకుండా చర్యలు చేపట్టాడానికి యుద్ధం విమానాల సహాయం కూడా తీసుకుంటున్నాం. ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి మన రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రిలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కరోనా తీవ్రత తగ్గాలంటే ప్రజల సహకారం కావాలి.. కరోనా వచ్చినా వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా వ్యాధి పెరుగుతుంది అని తెలిపారు. రెండో దశలో చాలా మంది మృత్యువాత పడుతున్నారు..చాలా బాధాకరం. ఎయిమ్స్ ఆసుపత్రి కి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం భూమి స్వాధీనం చేయలేదు. అందుకే ఆలస్యం కావడం జరిగింది అని పేర్కొన్నారు.

Related posts