telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పుష్ప” ఫస్ట్ లుక్… రఫ్ లుక్ లో సరికొత్తగా స్టైలిష్ స్టార్

Pushpa

`రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అల్లు అర్జున్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాకు `పుష్ప` అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో పూర్తి గడ్డంతో, రఫ్ లుక్‌తో బన్నీ సరికొత్తగా ఉన్నాడు. చిత్తూరు జిల్లాలోని స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను కూడా `రంగస్థలం` తరహాలోనే పీరియాడిక్ డ్రామాగా సుకుమార్ తెరకెక్కించబోతున్నారు. ‘పుష్ప’ను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు అన్ని భాషల ఫస్ట్ లుక్ పోస్టర్లనూ ఈరోజు విడుదల చేశారు.

Related posts