telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రంగ్ దే : నవంబర్ 12న ‘ఏమిటో ఇది’ లిరికల్ వీడియో సాంగ్

Rang-de

యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ తొలిసారి కలిసి నటిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ‘తొలి ప్రేమ’, ‘మజ్ను’ వంటి ప్రేమకథా చిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక లాక్‌డౌన్ విరామం తరవాత హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించి నితిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరించారు. మరికొన్ని కీలక సన్నివేశాలు, ఇటలీలో పాటల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏమిటో ఇది’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 12న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు.

Related posts