telugu navyamedia
సినిమా వార్తలు

70 సంవత్సరాల “తోడు దొంగలు”

నందమూరి తారక రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం ఎన్.ఏ.టి వారి “తోడు దొంగలు” సినిమా 15-04-1954 విడుదలయ్యింది.

ఎన్.టి.రామారావు గారి సోదరుడు నందమూరి తివిక్రమరావు గారు నిర్మాతగా నేషనల్ ఆర్ట్ థియేటర్ (ఎన్.ఏ.టి.) బ్యానర్ పై దర్శకుడు డి. యోగానంద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి మాటలు, పాటలు : సముద్రాల రామానుజాచార్య, సంగీతం: టి.వి.రాజు., ఫోటోగ్రఫీ ఎం.ఏ.రెహ్మాన్, నృత్యం: హీరాలాల్, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, గుమ్మడి, హేమలత టి.జి.కమలాదేవి, అట్లూరి పుండరీకాక్షయ్య, డా. శివరామ కృష్ణయ్య, మద్దాలి కృష్ణమూర్తి, అల్లు రామలింగయ్య, చలం, శేషగిరిరావు, దాసరి లక్ష్మయ్య, పార్వతి, సౌదామిని, రీటా తదితరులు నటించారు.

సంగీత దర్శకుడు టి.వి.రాజు గారి సంగీత సారధ్యంలో
“రాయె వయారం, రాయెనా వలపు దుమారం”
“ఉన్నతీరునే ఉన్నది ఉంది ఉన్నదినీకేముంది నీదన్నది నీకేముంది”
“ఆటలలో ఆటా సాటిలేనిదేయాట పేకాట,
భలే మాటా, శెభాష్ భేటా ”
“కరువు కాటకములని నిధులు జమచేసి”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

ఎన్టీఆర్ గారు ఒక ప్రక్క హీరోగా బయటి చిత్రాలలో నటిస్తూ ఉన్నత ఆశయాలతో కళాత్మక చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశ్యంతో సొంతగా ఒక నిర్మాణ సంస్థ ను స్థాపించి ఆ బ్యానర్ ఎన్.ఏ.టి (N.A.T) పై తొలి చిత్రం గా “పిచ్చి పుల్లయ్య ” సినిమా ను నిర్మించారు.

ఆ పిదప తమ నిర్మాణ సంస్థ లో రెండవ చిత్రం గా “తోడు దొంగలు”‘ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఆంధ్రాలో 15-04-1954 న విడుదల కాగా రెండు వారాల పిదప తెలంగాణా లో 29-04-1954 విడుదల కావటం జరిగింది. ఈచిత్రం లో ఎన్టీఆర్ కు జతగా పి.హేమలత గారు నటించారు.

ఈ చిత్రానికి మంచి పేరు మాత్రమే లభించింది కానీ భాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయి నిర్మాత కు నష్టాలను చేకూర్చింది.

అయితే ఆ ఏడాది 1954 లో జాతీయ స్థాయి అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా రాష్ట్రపతి ప్రశంసాపత్రాన్ని అందుకున్నది. ఈ చిత్రం జాతీయ చలనచిత్రోత్సవాలలో ఉత్తమ చిత్రంగా భారత రాష్ట్రపతి గారి చేత యోగ్యతా పత్రం అందుకోవటం మినహా నిర్మాతలైన నందమూరి సోదరులకు ఆర్ధికంగా తీవ్ర నష్టాన్ని చేకూర్చింది.

ఈ చిత్రం యావరేజ్ గా నడిచింది కొన్ని కేంద్రాలలో
50 రోజులు ఆడింది. విజయవాడ – శ్రీ రామా టాకీస్ లో 63 రోజులు ప్రదర్శింపబడింది…

Related posts