telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో మెగా హీరోతో కియారా అద్వానీ రొమాన్స్…?

Kiara

మెగా హీరో వరుణ్ తేజ్ ఈ ఏడాది “ఎఫ్-2”, “గద్దలకొండ గణేష్” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వరుణ్ మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాబోయే కొత్త చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అల్లు వెంకటేష్, ముద్దా సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు వ‌రుణ్ తేజ్. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో వ‌రుణ్‌తేజ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ బాక్సర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ పాత్ర కోసం వ‌రుణ్ అమెరికా వెళ్లి బాక్సింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. వ‌చ్చే ఏడాది నుండి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. 2020 ద్వితీయార్థంలో సినిమాను విడుద‌ల చేసేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రాఫర్.

Related posts