telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బ్యాంకు ఖాతాదారులకు షాక్‌…

all banks

ఖాతాదారులకు షాక్‌ ఇచ్చాయి బ్యాంకులు. అదేంటీ అనుకుంటున్నారా.. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా మార్చి 15వ తేదీ నుంచి రెండు రోజుల పాటు సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అంటే మార్చి 15, 16 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఇక మార్చి 13వ తేదీన రెండో శనివారం కాగా.. మార్చి 14వ తేదీ ఆదివారం సెలవు. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. పండుగ సెలవులు, బ్యాంకుల ఖాతాల ముగింపు, రెండో శనివారాలు, 4 ఆదివారాలతో కలిసి మొత్తం ఈ నెలలో 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులు సూచించాయి. కాగా 10న మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న బ్యాంకుల శాఖలకు సెలవు ప్రకటించారు. మరోవైపు 12న మహాశివరాత్రి సందర్భంగా బ్యాంకుకు సెలవు ఉంటుంది.

Related posts