మహిళలతో కన్నీరు పెట్టించిన ఏపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ ఎంపీ కేశినేని హెచ్చరించారు. తుళ్లూరులో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మహిళలపై పోలీసుల దాడి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
పోలీసుల కారణంగా మూడు వేల మంది మహిళలు పడ్డ ఇబ్బందులను జాతీయ మహిళా కమిషన్ కు వివరించామని అన్నారు. 500 వీడియోలు, 1000 ఫొటోలను కమిషన్ సభ్యులకు అందజేశామని, మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చేశారని, పోలీసుల తీరు అర్థం కావడం లేదని, అధికారంలో ఎవరున్నా వారి తీరు మారకూడదని సూచించారు.