telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పార్టీలో అసమ్మతి… రాజీనామా చేసిన సీఎం

వచ్చే సంవత్సరం అసెంబ్లీ జరగనున్న ఉత్తరాఖండ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొంతపార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది సేపటి క్రితం గవర్నర్‌ బేబీ మౌర్ని కలిసి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అయితే… ఢిల్లీ వెళ్లి బీజేపీ అధిష్టానాన్ని మరుసటి రోజే రావత్‌ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడిన రావత్‌.. నాలుగేళ్లు ఉత్తరాఖండ్‌ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు బీజేపీకి ధన్యవాదాలు చెప్పారు. కాగా.. ఉదయ్‌ సింగ్‌ నగర్‌ జిల్లాలోని కతిమా అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పుష్కర్‌ సింగ్‌ ధమి డిప్యూటీ సీఎం అవబోతున్నట్లు సమాచారం.

Related posts