తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ అరికట్టేందుకు ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీటీడీ కూడా దీనిపై అలర్ట్ అయ్యింది. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తోంది. టీటీడీ ఈవో సింఘాల్ తిరుమలలో మీడియాకు 2020, మార్చి 14వ తేదీ శనివారం నిర్ణయాలను వెల్లడించారు. వచ్చే మంగళవారం నుంచి తీసుకున్న విధానాలను అమలు చేస్తామని అంటున్నారు. భక్తులు వేచి ఉండే విధానానికి స్వస్తి చెప్పాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఎఫెక్ట్ ఎన్ని రోజుల వరకు ఉంటుందో..అంత వరకు..భక్తులు క్యూ లైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించారు. వీరికి తాత్కాలికంగా టైమ్ స్లాట్ టోకెన్లు ఇచ్చి..శ్రీ వారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. భక్తులు గాని, సమూహం గాని..ఒక చోట గుమికూడా ఉంటే..వైరస్ వ్యాపించే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది.,ప్రస్తుతం తిరుమలలో 30 కంపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఈ కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిక్కిరిసిపోతుంటాయి. వందలాది మంది ఇందులో దర్శనం కోసం వేచి చూస్తుంటారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి చెందుతుందని భావించి పై విధంగా నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారికి నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది. భక్తులు ఒకే చోట గుమికూడ ఉండవద్దనే తమ లక్ష్యమని టీటీడీ ఏఈ అంటున్నారు. ముందుగానే టోకెన్లు ఇస్తామని, నేరుగా శ్రీవారి దర్శనం చేసుకొనే అవకాశం ఉందని అంటున్నారు.
previous post