telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశవాళీ వ్యాక్సిన్ పై కేంద్రం క్లారీటీ

corona vaccine India

కరోనా వైరస్ కు దేశవాళీ వ్యాక్సిన్ ను ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రభుత్వ రంగ ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వెల్లు విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మరోసారి స్పందించింది. “అన్ని క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయితేనే ఆ సమయానికి వ్యాక్సిన్ వస్తుంది.

సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆరోగ్య శాఖలో ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న రాజేశ్ భూషణ్ వెల్లడించారు. “డీజీ – ఐసీఎంఆర్ లేఖలో లేని అంశాలను ప్రస్తావించవద్దని, అది కేవలం అంచనా తేదీ మాత్రమే అని తెలిపారు. ప్రజల భద్రత విషయంలో ఎన్నడూ రాజీ పడాలని భావించ లేదని ఆయన పేర్కొన్నారు.

ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ ను ఫాస్ట్ ట్రాక్ తో పూర్తి చేసి, ఆగస్టు 15 నాటికి ట్రయల్స్ పూర్తి చేసి, వ్యాక్సిన్ ను విడుదల చేసేలా చూడాలంటూ, పలు మెడికల్ కాలేజీలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ పనితీరుపై అధ్యయనం చేసేందుకు ఎంతో సమయం పడుతుందని, దీని విడుదలకు తేదీలను నిర్ణయించి, తొందరపడటం ఏంటని పలువురు విమర్శలు గుప్పించారు.

Related posts