టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఇప్పటివరకు మూడు సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ ను అందుకోలేకపోయాడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్. ఈ చిత్రంలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఇక తాజాగా ఈ బ్యాచిలర్ సినిమా నుంచి ‘జిందగీ’.. సాంగ్ రిలీజైంది. అయితే ఈ పాట ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు వాసు వర్మ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. గోపిసుందర్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటివరకు సరైన హిట్టు లేని అఖిల్ ప్రస్తుతం ఈ సినిమాపైనే చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. చుడాలిమరి ఈ సినిమా అఖిల్ కు హిట్ ను అందిస్తుందా… అక్కినేని అభిమానులను బ్యాచిలర్ ఆకట్టుకుంటుందా… లేదా అనేది.
previous post