telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

స్నేహం…

అమ్మతో స్నేహం అమృతం పంచు..
నాన్నతో స్నేహం దైర్యం పెంచు…
అక్క తమ్ముడి తో స్నేహం ఆనందాలను పెంచు …
పక్కింటి పిల్లలతో స్నేహం తారతమ్యాలు తెంచు..
ఎదురింటి వారితో స్నేహం ఎదురులేకుండా ఉంచు..
నలుగురితో స్నేహం అహంకారాన్ని అనుచు…
అందరితో స్నేహం అవరోధాలు తుంచు…
చిన్నారులని చిరుదివ్వగా వెలగనిద్దాం…
ఆనందం తో స్నేహితులతో మెలగనిద్దాం…
ఒంటరి తనం దరిచేరకుండ స్నేహా హస్తమిచ్చి చేరువవ్వుదాం….
పుస్తకాలతో స్నేహం జ్ఞానం పెంచు…
ప్రకృతితో స్నేహం పరవశింప చేసు..
కలం తో స్నేహం కవితలను ఉద్బవించేలా చేసు…
స్నేహమొక మానసిక చైతన్య మవ్వాలి..
తారతమ్యాలు లేక దైర్యం నింపాలి…
స్నేహమొక ఆనందానుభూతినివ్వాలి…కష్టాల్లో బాధల్లో వెన్ను తట్టి తోడవ్వాలి.. ..
ఆత్మీయ మనసుతో ఆసరవ్వాలి…
డబ్బుతో ముడిపెట్టక గౌరవించాలి…
మంచి చేడులని గుర్తించి ఎత్తిచూపాలి…
ప్రతి పలకరింపు మధురమవ్వాలి…
కలిసిన ప్రతిసారి ప్రశాంతత పొందాలి…
స్నేహా మాధుర్యం అనుభవించాలి..
చెదిరిపోని స్నేహం ఆదర్శమవ్వాలి…
ఆత్మీయ అనుబంధం గా నిలవాలి…

Related posts