telugu navyamedia
రాజకీయ వార్తలు

జీఎస్టీతో చిన్న వ్యాపారులు నష్టపోయారు: రాహుల్

rahul gandhi to ap on 31st

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పై విమర్శలు గుప్పించారు. మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. నోట్ల రద్దు ప్రభావం ఆర్థికవ్యవస్థపై పడిందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. జీఎస్టీతో చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ, అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదని రాహుల్ విమర్శించారు.

మోదీ మాటలను నమ్మి ఎక్కవగా మోసపోయింది దేశ యువతేననీ రాహుల్‌ అన్నారు. అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని 2014లో మోదీ హామీనిచ్చారనీ, ఇప్పుడు చూస్తే కొత్త ఉద్యోగాలు పెద్దగా రాకపోగా, ప్రతీ 24 గంటలకు 27 వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. గత 45 ఏళ్లలో ఎన్నడూ నిరుద్యోగం రేటు ఈ స్థాయిలో లేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

Related posts