telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గుర్రంతో నడిచే రైలు… ఇప్పటికీ రాకపోకలు… ఎక్కడంటే ?

Horse-Train

ఇంతవరకూ మనం బొగ్గుతో, ఇంధనంతో నడిచే రైళ్లనే చూశాం. మరి గుర్రం ఇంజిన్ స్థానంలో ఉండి రైలు పెట్టెలను లాక్కెళ్లే ట్రైన్ ని చూశారా.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. పాకిస్తాన్లో ఓ ప్రాంతంలో గుర్రం రైలు పెట్టెను లాక్కుంటూ పరుగులు తీసే ట్రైన్ ఇప్పటికీ ఉంది. ప్రయాణికులు దానిపై రాకపోకలు సాగిస్తున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉన్న ఫైసలాబాద్ జిల్లా బచియానా రైల్వే స్టేషన్ నుంచి 11,000 జనాభా కలిగిన గంగాపైర్ గ్రామానికి వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేవు. రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. దీంతో 1898లో గంగారాం అనే వ్యక్తి 15 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించేందుకు వీలుగా గుర్రం రైలును ఏర్పాటు చేయాలనుకున్నారు. గంగారాం లాహోర్, ఢిల్లీలలో గంగారామ్ ఆస్పత్రి పేరుతో పేదలకు అతి తక్కువ ఫీజుతో వైద్యం చేసేవారు. ఆయనను సేథ్ గంగారాం అని కూడా అంటారు. ఆయన బచియానా రైల్వే స్టేషన్ నుంచి గంగాపైర్ వరకు గుర్రం రైలు కోసం ఓ చిన్న రైల్వే లైను ఏర్పాటు చేశారు. గుర్రం 15 నుంచి 20 మంది కూర్చొనే రైలు పెట్టెను లాక్కుంటూ వెళుతుండగా ప్రయాణికులు దాని మీద కూర్చుని సురక్షితంగా వారి గ్రామానికి చేరుకునేవారు. రెండు శతాబ్ధాలు గడిచినా ఇప్పటికీ ఈ రైల్వే లైను ఉంది. నేటికీ ప్రయాణికులు ఈ గుర్రం రైలు మీద రాకపోకలు సాగిస్తున్నారు.

Related posts