telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ “రాధే శ్యామ్ ” నుంచి సర్ ప్రైజ్ వచ్చేసింది

యంగ్ రెబల్‌స్టార్‌ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాను ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ లుక్’‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరక్టర్ ఎవరన్నది ఇంతవరకు క్లారిటీ రాలేదు. మొదటగా ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తారని అన్నారు ఆ తర్వాత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రెహమాన్ పెద్దగా ఇంటరెస్ట్ చూపట్లేదని సమాచారం. చివరికి జస్టిన్ ప్రభాకరన్ ను ఫైనల్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో సర్ ప్రైజ్ విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ మూవీలో ప్రభాస్ నటిస్తున్న “విక్రమాదిత్య” రోల్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అంతేకాదు ప్రభాస్ కు అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

Related posts