telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

50 సంవత్సరాల “అమ్మాయి పెళ్లి

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం భరణి కంబైన్స్ వారి ” అమ్మాయి పెళ్లి ” 07-03-1974 విడుదల.

నిర్మాత, దర్శకురాలు భానుమతి రామకృష్ణ, భరణీ
కంబైన్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి. స్క్రీన్ ప్లే,మాటలు: భానుమతి రామకృష్ణ,
కథ: పి.ఎస్.వైద్యనాధన్, మాటలు: డి.వి.నరసరాజు,
పాటలు: దాశరథి ,కొసరాజు, సి.నారాయణరెడ్డి, ఆత్రేయ ,గణపతిశాస్త్రి, ఫోటోగ్రఫీ: లక్ష్మణ్ గోరే,
సంగీతం: పి.భానుమతి, కళ: రాజేంద్రకుమార్, నృత్యం: వెంపటి సత్యం, ఎడిటింగ్: ఎం.సుందరం, అందించారు

ఈ చిత్రం లో ఎన్.టి.రామారావు, భానుమతి, గుమ్మడి, చంద్రమోహన్, లత, పద్మనాభం, ధూళిపాళ,
రావి కొండలరావు, మాడా, ఛాయాదేవి, రాధాకుమారి,
రత్న, మమత, పుష్పకుమారి, ప్రసన్నరాణి,
సత్యవతి, శివరామకృష్ణయ్య, తదితరులు నటించారు.

భానుమతి గారి సంగీత సారధ్యంలో
“బాబూ నిదుర పోరా,బాబ్బాబూ నిదుర పోరా”
“అమ్మ నాన్న జగడంలో అన్నం సున్నాయే”
“పాలరాతి బొమ్మకు నీ వగలెక్కడివీ'”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.
ఈ చిత్రం యావరేజ్ గా నడిచింది….

Related posts