telugu navyamedia
క్రీడలు వార్తలు

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ అంపైర్ మాకు వద్దు అంటున్న భారత ఫాన్స్…

జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టాన్ వేదికగా జరగనున్న ఈ మెగా ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన అఫీషియల్స్ పేర్లను ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. అయితే భారత అభిమానులు మాత్రం ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరోను మాత్రం అంపైర్‌గా నియమించొద్దని కోరుతున్నారు. 2014 నుంచి 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ వరకు.. భారత్ ఆడిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేస్తే ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. వాటికి సంబంధించిన గణంకాలను సైతం షేర్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్లతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2015 వన్డే వరల్డ్ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇక 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది. కెటిల్‌బర్ ఐరెన్ లెగ్ అంపైరింగ్ పుణ్యమా.. ఐసీసీ ఈవెంట్లో పాక్ చేతిలో ఎన్నడూ ఓడని కోహ్లీసేన చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో 180 పరుగులతో ఓడి టైటిల్ చేజార్చుకుంది. ఇక 2019 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఈ సెంటిమెంటే రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన కోహ్లీసేన.. సెమీఫైనల్లో మాత్రం చిత్తయింది. కెటిల్ బరో అంపైరింగ్ కారణంగా భారత్ ఓడిపోకున్నా.. అతను బాధ్యతలు నిర్వర్తించిన కీలక మ్యాచ్‌లన్నింటిలోనూ ఓటమిపాలైంది. అందుకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతన్ని అంపైర్‌గా నియమించవద్దని ఐసీసీని కోరుతున్నారు.

Related posts