telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపే దుబ్బాక ఉప ఎన్నిక..సర్వం సిద్ధం చేసిన అధికారులు

దుబ్బాక ఉప ఎన్నికకు కౌంట్ డౌన్‌ మొదలైంది. రేపే దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరుగునుంది. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 98028 మంది పురుషులు, 100719 మహిళలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే..ఈ ఉప ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నిక నిర్వాహణకు 5,000 సిబ్బందిని నియామకం చేశారు అధికారులు. అలాగే 315 బూత్ లు, 89 సమస్యాత్మక కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. కోవిడ్ నిబంధనలతో ఈ పోలింగ్ జరగనుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అధికారులు చేసారు. దుబ్బాక పోరులో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో ఇరవై మంది బరిలో ఉన్నారు. కాగా…టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబరు 9న వెలువడింది. నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. ఈ ఉప ఎన్నిక నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది.

Related posts