telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో దారుణం : కోతి కారణంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ మృతి !

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కోతిని బెదరగొట్టేందుకు ప్రయత్నించి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. కూకట్‌పల్లి జయనగర్‌లో నివాసం ఉంటున్న లోకేశ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ అప్పటి నుంచి అతడు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. వర్క్ ఫ్రం హోమ్‌ చేస్తున్న లోకేశ్.. మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడం గమనించాడు. కోతులు ఇంట్లోకి ప్రవేశించకుండా వాటిని బెదరగొట్టే ప్రయత్నం చేశాడు. ఇనుప రాడుతో వాటిని అక్కడి నుంచి తరిమేయడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే లోకేశ్ చేతిలో ఉన్న ఇనుపరాడ్‌ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలి షాక్ కొట్టింది. ఇది గమనించి కుటుంబ సభ్యులు వెంటనే లోకేశ్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే లోకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబానికి చేదోడుగా ఉన్న కొడుకు కళ్లముందే కన్నుమూయడంతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.మరోవైపు కూకట్‌పల్లి జయనగర్‌లో కొన్ని రోజులుగా కోతుల బెదడ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

Related posts