telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు వార్తలు

వచ్చిరాగానే కేటీఆర్ ను కలిసిన హనుమ విహారి…

ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ప్రారంభం కాగానే భారత ఆటగాళ్లు చాలా మంది గాయాల బారిన పడిన విషయం తెలిసిందే. అందులో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్, హైదరాబాద్ క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నాడు. సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ లో భాగంగా భారత జట్టును ఓటమి నుండి కాపాడిన విహారి గయా కారణంగా నాలుగో టెస్ట్ నుండి తప్పుకొని హైదరాబద్ చేరుకున్నాడు. ఇక అతను తాజాగా ఈరోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిసాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ”మిమ్మల్ని కలవడం మరియు క్రికెట్ గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపాడు. అయితే ఇంతకముందు సిడ్నీలో టెస్ట్ లో హనుమవిహారి ఆడిన తీరుపై మంత్రి కేటీఆర్ కూడా హర్షం వ్యక్తంచేశారు. ఇదో అద్భుతమైన టెస్టు అని, భారత ఆటగాళ్ల తెగువ, పట్టుదల, ధైర్యాన్ని కొనియాడారు. ఒకవైపు ఆటగాళ్లు  గాయాల బారిన పడినా, మరోవైపు జాత్యంహకార వ్యాఖ్యలు ఎదురైనా… ఏవీ జట్టు స్ఫూర్తిని దెబ్బతీయలేదని ప్రశంసించారు. ఈ డ్రా.. ఇన్నింగ్స్‌ విజయం కన్నా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. అప్పుడు కేటీఆర్ ట్విట్ పై  స్పందించిన విహారి… ధన్యవాదాలు చెప్పాడు. ప్రస్తుతం వీరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts