telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేటి నుంచి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభం..?

tsrtc buses

కరోనా నిబంధనల్లో సడలింపులు ఇచ్చినప్పటికీ కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు అనేకసార్లు చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పటికీ పరిష్కారం కాలేదు. అయితే.. తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసుల ప్రతిష్టంభన తొలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య సర్వీసుల పునరుద్ధరణపై తిరిగి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ హైదరాబాద్ లో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు సమావేశం కానున్నారు. అంతరాష్ట్ర ఒప్పందంపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య 1.60లక్షల కి.మీ మేర బస్సులు తిప్పాలని అంగీకారం కుదిరిన నేపథ్యంలో…రూట్ల వారీగా తిప్పే ప్రతిపాదనలపై ఇవాళ్టి భేటిలో చర్చించే అవకాశముంది. ఒప్పందం కుదిరితే వెంటనే బస్సులు తిప్పేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే సిద్ధమైంది. అయితే..ఇవాళ జరిగే చర్చలు సఫలం అవుతాయని అందరూ ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై క్లారీటీ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Related posts