telugu navyamedia
రాజకీయ

సమాఖ్య వ్యవస్థను మోదీ నిర్వీర్యం చేస్తున్నారు: కుమారస్వామి

CM Kumaraswamy killing order
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. బెంగళూరులో శుక్రవారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ..మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని  విమర్శించారు. ఓవైపు సత్యాలు వల్లెవేస్తున్న మోదీ మరోవైపు సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని  ఆరోపించారు. దేశానికి తనకు తాను రక్షకుడుగా మోదీ చెప్పుకుంటునే మరోవైపు తనవారిని రక్షించుకునేందుకు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలను లాక్కునేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అజ్ఞాతం లో ఉన్నారని  ధ్వజమెత్తారు. తాను చేసిన ఆరోపణలు అన్నింటిని సాక్ష్యాధారాలతో రుజువు చేస్తానని సవాలు విసిరారు.  కాంగ్రెస్ నేతలను ప్రలోభాలకు గురిచేస్తూ బీజేపీ నేతలు చేసిన ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ను మీడియా ముందు ప్రదర్శించారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, బల నిరూపణ చేసుకుంటామని కుమారస్వామి స్పష్టం చేశారు.

Related posts