telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముస్లింలపై విరుచుకుపడటం తగదు..మోదీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Asaduddin mim

ప్రధాని మోదీ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఎంఐఎం నిర్వహించిన ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ముస్లింలపై విరుచుకుపడటం కన్నా దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు. చరిత్రలో యజీద్ అనే వ్యక్తి రోజూ కోతిని తాకేవాడు, చివరకు ఆ కోతే అతన్ని కొరికేసిందని అన్నారు.

మోదీ చుట్టూ తిరుగుతున్న కోతులు కూడా ఏదో ఒక రోజూ ఆయన్ని కొరుక్కుతింటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జార్ఘండ్ లో మూక దాడికి గురై మృతి చెందిన తబ్రెజ్ అన్సారీ అంశాన్ని ప్రస్తావించారు. ఈ అంశాన్ని నీరుగార్చాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎవరైతే మూక దాడుల నిందితులు ఉన్నారో వారిని ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. 

Related posts