telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చాలా థ్యాంక్స్ పీకే ఫ్యాన్స్… మీ వల్ల క్క రోజే 35 లక్షల వ్యూస్ : ఆర్జీవీ

RGV

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అంటూ సెటైరికల్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘‘దమ్ముంటే వచ్చి నాపై దాడి చేయమనండి. నా ఆఫీస్ అడ్రస్ గూగుల్‌లో కొడితే వస్తుంది. ఎమ్మెల్యే కాలనీలో నా కంపెనీ ఉంది’’ అంటూ వర్మ బహిరంగ సవాల్ విసరడం, దీనిపై రియాక్ట్ అయిన పవన్ ఫ్యాన్స్ వచ్చి వర్మ ఆఫీసు అద్దాలు పగలగొట్టి నానా హంగామా చేయడం.. ఆ వెంటనే పోలీస్ కేసు, రామ్ గోపాల్ వర్మ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో వర్మ Vs పవన్ ఫ్యాన్స్‌‌ ఇష్యూ జనాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం ఉదంతాన్ని రామ్ గోపాల్ వర్మ.. తనదైన కోణంలో పబ్లిసిటీ స్టంట్‌గా వాడేస్తున్నారనే వాదనలు జనాల్లో మొదలయ్యాయి. వర్మ కూడా పవన్ అభిమానులు తన ఆఫీస్ పైన దాడి చేయడం వల్ల తనకే లాభం అంటున్నాడు. తాజాగా వర్మ ఆఫీస్ పై దాడి చేయడం వల్ల ‘పవర్ స్టార్’ ట్రైలర్ కు వ్యూస్ పెరిగాయి ఒక్క రోజే 30 లక్షల వ్యూస్ వచ్చాయి . ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపారు వర్మ. “చాలా థ్యాంక్స్ పీకే ఫ్యాన్స్ …. ఇదంతా మీరు ఎటాక్ చేయడం వల్లే …” అంటూ పోస్ట్ చేసాడు వర్మ.

Related posts