కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. షూటింగ్స్ అన్నీ రద్దు కావడంతో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంట్లో ఉంటూనే తమ అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా రోజూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. దాదాపు పదిహేనేళ్లపాటు వెండితెరపై అగ్రకథానాయికగా కొనసాగిన మిల్కీబ్యూటీ తమన్నా కూడా కొత్త విషయాలను నేర్చుకుంటున్నారట. తమన్నాకు తన మాతృభాష సింధి మాట్లాడటం రాదట. అందుకని ఈ లాక్‌డౌన్ సమయంలో దానిపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారట. తల్లితో సింధిలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని తమన్నా రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో తనతో సింధిలోనే మాట్లాడాలనే కండీషన్ పెట్టడమే కాకుండా ఏడాదిలో సింధి నేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారట తమన్నా.
previous post
next post