telugu navyamedia
రాజకీయ వార్తలు

బీమా కవరేజి రూ. 5 లక్షల వరకు పెంపు

nirmalasitaram as 2nd women as finance minister

పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా బీమా సౌకర్యం గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. బ్యాంకు డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కవరేజిని రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు ఈ బీమా గరిష్టంగా రూ.1 లక్ష వరకు మాత్రమే పొందే వీలుండేది. ఇప్పుడు దాన్ని రూ.5 లక్షల వరకు పెంచారు.

బ్యాంకులు ఖాతాదారులకు సొమ్ము చెల్లించడంలో విఫలమైన పక్షంలో ఈ మేరకు బీమా సౌకర్యం వర్తింపజేస్తారు. దీనికోసం ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరంలేదు. బ్యాంకులు చెల్లించే ప్రీమియంతోనే నిర్దేశిత గరిష్ఠ మొత్తం వరకు బీమా లభిస్తుంది. పొదుపు, రికరింగ్, కరెంట్ అకౌంట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఈ బీమా పొందవచ్చన్నారు.

Related posts