telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిమ్మగడ్డకు దిమ్మదిరిగే షాకిచ్చిన ఉద్యోగ సంఘాలు

Nimmagadda ramesh

స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించబోమని ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఉద్యోగుల, ప్రభుత్వం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఎన్నికల కమిషన్ కు తాము సహకరించమని తేల్చి చేప్పేశారు ఉద్యోగులు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేసిందని ఆరోపిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. అటు.. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది ఎస్ఈసీ. ఎన్నికల కమిషన్ జారీచేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రొసీడింగ్సులో పాల్గొనే ఉద్యోగులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఇతర రాష్ట్రాలలో మాదిరిగా.. శానిటైజర్, మాస్కులు సరఫరా చేయాలని సూచించింది కమిషన్. ఫ్రంట్ లైన్ వారియర్సుతో పాటు పోలింగులో పాల్గొనే సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచన చేసింది. పోలింగులో పాల్గొనే సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది కమిషన్.

Related posts