ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ నియమాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. అయితే ఒకే రోజు రెండు పరరీక్షలుండడంతో అభ్యర్థులు అయోమయానికి గురవ్తున్నారు. వచ్చే నెల 5న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జరగనుండగా అదే రోజున ఎల్ఐసీ ఏఏఓ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-2 పరీక్షకు ఇప్పటికే 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలామంది ఏఏవో పరీక్షకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏ పరీక్షకు హాజరుకావాలో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
అయితే గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా తాము పలుమార్లు కోరినా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) పట్టించుకోలేదని కొందరు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు జరిగినప్పుడు రాష్ట్ర స్థాయి పరీక్షలను వాయిదా వేసేవారని , కానీ ఏపీపీఎస్సీ ఆ సంప్రదాయాన్ని ప్రస్తుతం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా చేస్తే జనాభా నియంత్రణ సాధ్యం: బాబా రాందేవ్