telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు…

బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ… క్లిష్ట పరిస్థితిలో ప్రత్యేక బడ్జెట్ ని కేంద్రం ప్రకటించింది. బడ్జెట్ లోని ఆర్థిక అంశాల పై అవగాహన లేక విమర్శలు చేస్తున్నారు.. దేశ ఎకానమీ కొద్దిగా దెబ్బ తిన్న బడ్జెట్ వల్ల మళ్ళీ పుంజుకుంటోంది అని తెలిపారు. రెండు రాష్ట్రాలు సమన్వయం తో విభజన హామీలు కేంద్రంతో మాట్లాడి పరిష్కరించుకోవాలి, రవాల్సినవి ఏమన్నా ఉంటే తెచ్చుకోవాలి .. అది రెండు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని సుజనా చౌదరి అన్నారు. ఇక అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నామని ఇక టీడీపీ,వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ఇది ఆగదని అన్నారు. ప్లాంట్ వేరే దేశానికి తీసుకెళ్ళేది కాదన్న ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం త్యాగం చేసిన అందరిని గుర్తు చేసుకోవాలని అన్నారు. మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఉద్యమం మరింత ఉద్ధృత రూపం దాలుస్తోంది. దీనిపై రాజకీయ..కార్మిక వర్గాలు భగ్గుమంటున్నాయి. స్ట్రాటజిక్ సేల్ నిర్ణయం తిప్పికొట్టేందుకు ఆందోళనలకు దిగుతున్నాయి. మహా ధర్నా చేపట్టిన కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నాయి. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మహాధర్నా కోసం వేలాదిగా కార్మికులు తరలివచ్చారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. సేవ్ స్టీల్ ప్లాంట్ ఆందోళనకు వైసీపీ నేతలు మద్దతు పలికారు. ప్రాణాలు ఇచ్చయినా స్టీల్ ప్లాంట్‌ను  కాపాడుకుంటామని చెబుతున్నారు.  విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి నిరాహారదీక్షలు, రాజీనామాలకు వెనుకాడబోమని ప్రకటించారు ఎంపీలు. స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన మహాధర్నాకు సంఘీభావం ప్రకటించారు.

Related posts