telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సోనియమ్మ వల్లే నీకు పదవులు.. ఆజాద్ లేఖపై మండిపడ్డ వీహెచ్

hanmanth rao congress

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ లేఖపై ఆ పార్టీ తెలంగాణ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. సొంత పార్టీని ఉద్దేశించి ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇందిరాగాంధీ లేకపోతే నీవు ఎలా వచ్చేవాడివని ప్రశ్నించారు. ఇందిరమ్మ, సోనియమ్మ వల్లే నీకు పదవులు వచ్చాయని అన్నారు.

రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా ఉన్న నీవు, పార్టీ హైకమాండ్ కు లేఖ ఎలా రాస్తావని వీహెచ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దయ వల్ల గత 40 ఏళ్లుగా ఏదో ఒక పదవిలో ఉంటున్నావని అన్నారు.

ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కాంగ్రెస్ నీకు అండగా ఉందని చెప్పారు.కాంగ్రెస్ వల్ల ఎంతో అనుభవించిన ఆయన పార్టీ కష్టంలో ఉన్న ఈ సమయంలో మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని వీహెచ్ దుయ్యబట్టారు.

Related posts