telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అందుకే నయీం కేసు ఛార్జ్ షీట్ లో నా పేరును చేర్చారు: ఆర్.కృష్ణయ్య

Krishnaiah bc

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే నా పేరును నయీం కేసు ఛార్జ్ షీట్ లో చేర్చారని బీసీ సంఘాల నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. నయీం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను కేవలం నయీం బాధితుల పక్షాన మాత్రమే మాట్లాడానని చెప్పారు. నయీంకు సంబంధించిన విషయాలను తాను అప్పట్లోనే చెప్పానని తెలిపారు.

తన వద్దకు ప్రతి రోజు ఎంతో మంది వస్తుంటారని.. వాళ్ల తరపున ఫోన్ చేసి నయీంను బెదిరించానని చెప్పారు. తాను ఎలాంటి దందాలు చేయలేదని అన్నారు. తన పేరును ఛార్జ్ షీట్ లో పెట్టడాన్ని ఆయన ఖండించారు. బీసీల పక్షాన పోరాడకుండా తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నయీం కేసులో దొరికిన డబ్బును బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related posts