telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లక్ష డబుల్‌ బెడ్‌రూం ఛాలెంజ్.. భట్టి ఇంటికి తలసాని!

batti talasani

హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జరిగితే తమనకు చూపించాలని శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లుభట్టి విక్రమార్క సవాలు విసిరారు. భట్టి సవాలును మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

దీంతో ఈ రోజు ఉదయం మంత్రి తలసాని అధికారులతో నేరుగా భట్టి విక్రమార్క ఇంటికి చేరుకున్నారు. ఆయన వస్తారని ఊహించని భట్టి మొదటి షాక్ అయ్యారు. అనంతరం తలసానిని సాదరంగా లోపలకి ఆహ్వానించారు. ఇద్దరు కలిసి కాసేపు సరదాగా చర్చించుకుని అనంతరం వారిద్దరు ఒకే కారులో ఇళ్లను చూడడానికి బయలుదేరారు.

నిన్న తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతోన్న సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలపై భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు గుప్పించారు. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై ఆయన ప్రశ్నించారు. ఆయా ప్రాంతాల్లో ఆ వసతులు ఉన్నాయంటే గతంలో కాంగ్రెస్ చేసిన పనుల వల్లేనని, టీఆర్‌ఎస్‌ ఏమీ చేయలేదని అన్నారు.

ఈ క్రమంలో ఆయనపై తలసానితో పాటు పలువురు మంత్రులు మండిపడ్డారు. దీంతో భట్టి మళ్లీ కలుగజేసుకుని నగరంలో లక్ష ఇళ్లు ఎక్కడ నిర్మించారో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సమయంలోమంత్రి తలసాని మాట్లాడుతూ… రేపు ఉదయం భట్టి ఇంటికి వస్తానని, నగరంలో ఎక్కడెక్కడ డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు నిర్మించామో స్వయంగా చూపిస్తానని అన్నారు.

Related posts