విశాఖలో కలకలంరేపిన దళిత యువకుడి శిరోముండనం ఘటనపై పోలీసులు నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పలు సెక్షన్ల కింద పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. తాజాగా శిరోమండనం ఘటనపై సీసీ ఫుటేజ్‌నుపోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా విడుదల చేశారు. ఈ వీడియోలో శ్రీకాంత్‌కు శిరోముండన చేసినట్లు పక్కాగా ఆధారం లభించింది. ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ కేసులో మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలినట్టు తెలుస్తోంది. .దీంతో నూతన్ నాయుడు భార్యతో పాటు మిగతావారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు యువకుడికి శిరోముండనం ఘటనకు వ్యతిరేకంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెందుర్తి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.