ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గుత్తేదారులకు షాకిచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోలవరం కాంట్రాక్టును రద్దుచేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో జరుగుతున్న 3,543 రహదారి పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పనుల విలువ రూ.1,031.17 కోట్లుగా ఉందని సమాచారం.
పంచాయతీరాజ్ తో పాటు ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక కింద చేపడుతున్న పనులను జగన్ సర్కారు నిలిపివేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018, ఏప్రిల్ కు ముందే అనుమతి పొందినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.