telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాస్కులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం: దేవినేని ఫైర్

devineni on power supply

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం జగన్ పాలనచేతగాని తన అసమర్థతను ఒప్పుకోవడం లేదని ఆయన మండిపడ్డారు

ఒక్కఛాన్స్ పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. కేంద్రానికి చెబుతున్న కరోనా లెక్కలకు, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులకు పొంతనే ఉండటం లేదని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది కరోనా రోగులకు చికిత్స అందించారో చెప్పగలరా? అని ప్రశ్నించారు.

చంద్రబాబు పెట్టిన మెడ్ టెక్ జోన్ ని వాడుకోవడానికి ప్రభుత్వానికి నామోషీగా ఉందని దేవినేని అన్నారు. ఎక్విప్ మెంట్ లేదని వైద్య సిబ్బంది, డాక్టర్లు ఎందుకు రోడ్లెక్కుతున్నారు? అని ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాల్లో పెడుతున్న రూ.500 భోజనాన్ని మంత్రులు తినాలని అన్నారు. ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు పక్కరాష్ట్రాల్లో చికిత్స తీసుకోవడానికి వెళితే, సామాన్యుడు మాత్రం ఇక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడని దేవినేని దుయ్యబట్టారు.

Related posts