ప్రస్తుతం ఏపీ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం రసవత్తరంగా మారుతుంది, అయితే తాజాగా దీని పై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోడలి నాని… సోము వీర్రాజు మాటలను ఆ పార్టీ కార్యకర్తలే పట్టించుకోరని ఎద్దేవా చేశారు.. సోము వీర్రాజు మా మీద ఆరోపణలు చేసే బదులు కేంద్రంతో ఒక్క స్టేట్‌మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేసిన కొడాలి.. తెలియని ఓ మంత్రి ట్వీట్ చేశారు… వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించటం లేదని… కేంద్రంతో సోము వీర్రాజు చెప్పించాలని కోరారు కొడాలి. కాగా.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోమువీర్రాజు.. ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ, టీడీపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించిన ఆయన.. ప్రభుత్వం టీడీపీతో చేతులు కలిపి బీజేపీని ఏకాకిని చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలపై దాడుల అంశం నుంచి దృష్టి మరల్చేందుకే.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని టీడీపీ, వైసీపీ తెరపైకి తెచ్చాయని చెప్పుకొచ్చారు. ఇక, స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని.. స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర మంత్రి ఒక్క ప్రకటన చేయలేదని.. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, మరి ఉద్యమం ఎందుకు ? అని ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం కోడలి చేసిన వ్యాఖ్యల పై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
previous post
next post