telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉపాధ్యాయ సంఘాల పీఆర్సీ ఫైట్‌లో మ‌రో ట్విస్ట్‌..

*ఉపాధ్యాయుల ఆందోళనలో వేరే శక్తులు ఉన్నాయి..

*పీఆర్సీ ఫైట్‌లో మ‌రో ట్విస్ట్‌..

*వీడియోను రిలీజ్ చేసిన పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ నేత‌లు..

* సీఎం జ‌గ‌న్‌తో జోసెఫ్ సుథీర్‌బాబు ఎస్టీయు నేత

*మీటింగ్ ఒక మాట‌..బ‌య‌ట మ‌రో మాట‌..

తమపై కొంతమంది ఉపాధ్యాయులు , ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఉద్యోగ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి , సూర్యనారాయణలు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఫిర్యాదు చేశారు .

ఈ క్ర‌మంలో ఉపాధ్యాయ సంఘాల వీడియోను పీఆర్సీ స్టీరింగ్‌ కమిటీ స‌భ్యులు బ‌య‌ట‌పెట్టారు. హెచ్‌ఆర్‌ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నామని.. పీఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేలా చూశామని పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. అదనపు పెన్షన్‌, సీసీఏ కూడా వచ్చిందన్నారు.

ఉపాధ్యాయ సంఘాలు ప్రతి అంశంలో చర్చల్లో పాల్గొన్నాయి. అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు చర్చల నుంచి బయటకు రావాల్సింది. ఫిట్‌మెంట్‌పై అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. సమ్మె అపుదాము అన్నా కూడా ఒకే చెప్పారని.. వారిని ఎవరో ప్రభావితం చేస్తున్నారని, వేరే శక్తులు ఉపాధ్యాయుల ఆందోళనలో ఉన్నారనే అనుమానాలు ఉన్నాయని పీఆర్సీ జేఏసీ నేతలు ఆరోపించారు.

ఉద్యమంలో ఉన్నప్పుడు అన్ని భరించాలని.. లేకపోతే నాయకులు అనిపించుకోరని ఆయన హితవు పలికారు. ఉద్యోగులు వాట్సాప్ సందేశాలు ఎవరికి పంపద్దని .. మంచి చెడూ ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.

ఉపాధ్యాయ ముసుగులో దుష్ఫ్రచారం చేస్తున్నవారిపై ప్ర‌భుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నిర్ణయంలోనూ 20 మంది అభిప్రాయం మేరకే ముందుకెళ్లామన్నారు. మెరుగైన ప్రయోజనం వచ్చింది కాబట్టే సమ్మె విరమించామన్నారు.

గొప్ప పిఆర్సి అని ప్రభుత్వం కానీ, తాము కానీ చెప్పడం లేదన్నారు. తాము పిఆర్సి సాధన సమితి పేరుతో గొప్ప పిఆర్సి సాధించామని చెప్పడం లేదని.. ఉన్నంతలో మంచి ఫలితాలు వచ్చాయి అని సూర్యనారాయణ వెల్లడించారు. 27 శాతం ఫిట్మెంట్ ఇస్తే మంచిది అని చాలా సార్లు సీఎంకు చెప్పామని ఆయన తెలిపారు

ఉపాధ్యాయ సంఘాలు మంత్రులు పక్కన కూర్చుని మాట్లాడలేదా? గ్రాట్యుటీ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై చర్చ జరిగినప్పుడు మీకు తెలియదా?. అన్నింటికీ ఒప్పుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారా అంటూ ఉపాధ్యాయ సంఘాలను పీఆర్సీ జేఏసీ నేతలు నిలదీశారు.

Related posts