telugu navyamedia
క్రైమ్ వార్తలు

వివాదాస్పద ట్వీట్ : హిందీ నటుడు, విమర్శకుడు కేఆర్కే అరెస్ట్

కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తూ, అగ్ర తారలతో పాటు భారీ సినిమాలపై విమర్శలు చేస్తూ నెటిజన్లలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్‌ను పోలీసులు మంగళవారం ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు

బాలీవుడ్ సినిమాల్లో కేఆర్‌కేగా పేరొందిన కమాల్ ఖాన్ ముంబయి విమానాశ్రయంలో విమానం దిగగానే ముంబయి నగరంలోని మలాద్ పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించేందుకు తీసుకువెళ్లారు.

రెండేళ్ల క్రితం..2020లో కమాల్ ఖాన్ చేసిన వివాదాస్పద ట్వీట్ పై అప్పట్లో పెట్టిన కేసులో అరెస్టు చేసి మంగళవారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు చెప్పారు.

బాలీవుడ్ నటుడు కమాల్ తరచూ విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. కమాల్ ఖాన్ పలు హిందీ, భోజ్ పురి సినిమాల్లో నటించడంతోపాటు నిర్మించారు.కేఆర్కే బిగ్‌ బాస్ కంటెస్టెంటు కూడా కావడం విశేషం.

కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయి గతంలో కేసులు వేశారు.

సల్మాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడటం లేదని, వసూళ్లు రావడం లేదని కేఆర్కే ట్వీట్స్ చేశారు. ‘రాధే : మోస్ట్ వాంటెడ్ భాయ్’ విడుదల అయినప్పుడు కేఆర్కే వరుస ట్వీట్స్ చేశారు. సినిమా బాలేదని రివ్యూ ఇవ్వడమే కాకుండా… కలెక్షన్స్ పోస్ట్ చేస్తూ ఫ్లాప్ అని విమర్శలు చేశారు.

తన పరువుకు భంగం వాటిల్లే , ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ట్వీట్స్ ఉంటున్నాయని సల్మాన్ తరపు లాయర్ కోర్టులో కేసు వేశారు. ఆ తర్వాత సల్మాన్ గురించి ఎటువంటి ట్వీట్స్ చేయవద్దని కేఆర్కేను కోర్టు ఆదేశించింది.

గత ఏడాది కేఆర్కే మీద మనోజ్ బాజ్‌పాయి క్రిమినల్ కేసు వేశారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ను ‘సాఫ్ట్ పోర్న్’ సిరీస్‌గా కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నారు. అంతే కాదు… మనోజ్ భార్య, కుమార్తె గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో పరువు నష్టం ద్వావా వేశారు.

Related posts