దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ట్విటర్ వేదికగా స్పందించారు. దిశ అత్యాచార ఘటన అత్యంత బాధాకరమైన విషయం అని అన్నారు. దిశను అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన వారికి సరైన శిక్ష పడిందని పేర్కొన్నారు.
అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఇలాంటి శిక్షలే సరి అన్నారు. నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం వల్ల దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. తాజా చర్యతో నేరం చేసిన వారికి తగిన శిక్ష ఖాయమన్న సంకేతం ఇచ్చినట్టయిందని అభిప్రాయపడ్డారు. మరోసారి ఇలాంటి దుర్మార్గాలకు ఎవరూ ఒడిగట్టకుండా కఠిన శిక్ష విధించేలా చట్టాలను మార్చాలని సీఎం జగన్ ఇదివరకే చెప్పినట్లు పేర్కొన్నారు.
దేశం ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోంది: రాందేవ్