telugu navyamedia
క్రైమ్ వార్తలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సహా 7గురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారులో డియోలీ నుంచి వార్ధాకు వెళ్తుండ‌గా..వంతెనపై నుంచి కారు కిందపడిన ఘటనలో ఏడుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న సెల్సూరా ప్రాంతంలో సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది.

మృతుల్లో గోండియా జిల్లా తిరోడా బీజేపీ ఎమ్మెల్యే విజయ్ రహంగ్‌డేల్ ఏకైక కుమారుడు ఆవిష్కార్ రహంగ్​డేల్​ కూడా ఉన్నారు. సెల్సురా గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జ్ దగ్గరకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు అదుపుతప్పి 50 అడుగుల లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో కారులోని అందరూ మృతి చెందారు. వీరంతా సావంగిలోని మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నట్లు తెలుస్తోంది. మృతులను నీరజ్ చవాన్, అవిష్కర్ రహంగ్‌డేల్, నితేష్ సింగ్, వివేక్ నందన్, ప్రత్యూష్ సింగ్, శుభమ్ జైస్వాల్, పవన్ శక్తిగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై ప్రస్తుతం పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts