telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ ముక్త్‌ భార‌త్ కు కేసీఆర్ పిలుపు..అందుకు ప్ర‌తీఒక్క‌రు స‌న్న‌ద్ధం కావాలి

*పెద్ద‌ప‌ల్లి సీఎం కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌
*క‌లెక్ట‌రేట్ ను, టీఆర్ ఎస్ పార్టీ భ‌వ‌నాన్నిని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
*మోదీ టార్గెట్‌గా తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సీఎం కేసీఆర్‌
*బీజేపీ ముక్త్‌ భార‌త్ కు కేసీఆర్ పిలుపు
*అందుకు ప్ర‌తీఒక్క‌రు స‌న్న‌ద్ధం కావాలి
*2024 ఎన్నిక‌ల్లో బీజేపీని ఓడించాల‌ని పిలుపు

*గోల్ మాల్ ప్రధాని గుజరాత్ మోడల్ పేరుతో నాశనం చేశారు.
*కేంద్రంలో బీజేపీ పోయి ..రైతుల ప్ర‌భుత్వం రాబోతుంది.

బీజేపీ ముక్త్‌ భార‌త్ కు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్‌ అందుకు ప్ర‌తీఒక్క‌రు స‌న్న‌ద్ధం కావాల‌ని అన్నారు.
పెద్దపల్లి జిల్లాల్లో కలెక్టరేట్, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ టార్గెట్‌గా సీఎం కేసీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు..

తెలంగాణ‌లో ఉన్న ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డా లేవ‌ని రైతుసంఘం నాయ‌కులు అంటున్నారు. న‌న్ను దేశ రాజ‌కీయాల్లోకి ర‌మ్మ‌ని ఆహ్వానిస్తున్నారు.

గోల్ మాల్ ప్రధాని గుజరాత్ మోడల్ పేరుతో నాశనం చేశారు. దేశ ప్రజలను దగా చేస్తూ, మోసం చేస్తూ అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం.. అడ్డగోలుగా ధరలు పెంచుతూ పేదలను మరింత పేదలుగా మార్చేస్తుందన్నారు.గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, శ్మశానాల మీద పన్ను, పాల మీద జీఎస్టీ, చేనేత కార్మికులపై జీఎస్టీ, ఇలా అన్ని రకాలుగా ధరలు పెంచుతూ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

గాంధీ పుట్టిన గుజరాజ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అన్నారు. కానీ కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దీనికి సమాధానం చెప్పాలి? తెలంగాణలో ఉన్న ఏ పథకం కూడా గుజరాత్‌లో లేదు.

మతం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో దోపిడీ తప్ప మరేమీ లేదు. దేశాన్ని దోచే దోపిడీ గాళ్ల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడ కనిపిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంతో ఉందామా? లేక ఢిల్లీ నుంచి వచ్చే వాళ్లకు గులాం అవుదామా? అని ప్ర‌శ్నించారు

మోడీ తెలివిత‌క్కువ పని వ‌ల్ల ఆహార కొర‌త ఏర్ప‌డింది. శ్రీరాం సాగ‌ర్ లో నీళ్లు పారాలా? మ‌త క‌ల‌హాల నెత్తురు పారాలా? ఇటువంటి దొంగ‌ల‌ను న‌మ్మితే ఆగం అయితం. రైతుల‌ను, పేద‌ల‌ను ఆదుకోకుండా సంక్షేమ ప‌థ‌కాలు బంద్ చేయాల‌ని అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ పోయి.. రైతు ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంది.. వ్యవసాయ బోర్లకు ఎందుకు మీటర్లు పెట్టాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నరేంద్రమోదీకి రైతులంతా కలిసి మీటర్ పెట్టాలన్నారు. మోడీ నువ్వు కార్పొరెట్ వాళ్ల‌కు దోచిన అంత కాదు.. రైతుల‌కు ఇచ్చేది అని కేసీఆర్ అన్నారు.

 

Related posts