telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

‘సాఫ్ట్‌వేర్ శారద’కు అండగా నిలిచిన టిటా!

software sharada warangal

లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎన్నో సంస్థలు వేతనాలు చెల్లించే పరిస్తితి లేక ఉద్యోగులను తొలగించారు. .అందులో భాగంగా వరంగల్ కి చెందిన శారద అనే ఓ అమ్మాయి హైదరాబాదులో తానూ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. అయినప్పటికీ తానూ మాత్రం దైర్యాన్ని కోల్పోలేదు. కుటుంబ పోషణకి గాను మార్కెట్‌లో ఉండి కూరగాయల వ్యాపారం చేస్తోంది.

ఆమె కథనాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టిటా) అండగా నిలిచింది. శనివారం ఆమెకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందించిన టిటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మక్తాల.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆమెకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు.ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో టిటా చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో ఉచితంగా శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను ఆమెకు అందించారు.

Related posts