telugu navyamedia
రాజకీయ వార్తలు

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం

congress chidambaram

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. కరోనా అనేది ‘దేవుడి చర్య’ అంటూనిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై చిదంబరం ఘాటుగా స్పందించారు.

 ఆర్థిక మంత్రి ఏమైనా దైవదూతా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా రాకముందు 2017 నుంచి 2020 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటానికి కారణాలేమిటని అడిగారు. ఈ ప్రశ్నకు దైవదూత ఏమైనా సమాధానం ఇస్తారా? అని ప్రశ్నించారు.

జీఎస్టీ బకాయిల వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటును రుణాల ద్వారా పూడ్చుకోవాలంటూ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించడాన్ని చిదంబరం తప్పుపట్టారు. ఆర్బీఐ విండో కింద రుణాలు తీసుకోవడం అంటే, మార్కెట్ బారోయింగ్ కిందే అర్థమని అన్నారు. ఇది కేవలం పేరు మార్పు తప్ప మరేం కాదని చెప్పారు. దీని వల్ల ఆర్థికభారం రాష్ట్రాలపైనే పడుతుందని అన్నారు. రాష్ట్రాల ఆర్థిక భారానికి సంబంధించిన బాధ్యతను కేంద్రం తీసుకోకపోవడం సరికాదని అన్నారు.

Related posts