telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పురపాలక శాఖ వార్షిక నివేదిక విడుదల

KTR TRS Telangana

తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదిక(2019-20)ను ఆ శాఖ మంత్రి కే. తారకరామారావు ఈ రోజు ప్రగతి భవన్‌లో విడుదల చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, ఇతర విభాగాధిపలుతు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గత సంవత్సర కాలంగా పురపాలక శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పురోగతిని ఈ కార్యక్రమంలో మంత్రి వివరించారు.

పట్టణాల రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను చేపట్టిందని, ముఖ్యంగా నూతన పురపాలక చట్టం ద్వారా పట్టణాలను మార్చాలన్న లక్ష్యంతో ముందుకుపోతుందని తెలిపారు. పట్టణాలు పురోగతి సాధించేందుకు ప్రభుత్వంతో పాటు పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. .పట్టణాల్లో ప్రజలకు అవసరం అయిన ప్రాథమిక సౌకర్యలపైన ప్రస్తుతం తమ దృష్టి ఉన్నదన్నారు.

హోర్డింగ్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను మార్చడం కోసం యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం, మెట్రో ప్రతిపాదిత మూడు మార్గాల్లో రవాణా సదుపాయాలను అందుబాటులోకి తేవడం వంటి ఇతర చర్యలను చేపడుతారని తెలిపారు. దీర్ఘకాలిక లక్ష్యంతో తెలంగాణ పురపాలక శాఖ పని చేస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ నగరంలో రోడ్ల ఆధునీకరణ చేపట్టడం వంటి పనులను పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి సంస్థ చేపట్టిందన్నారు.

Related posts