telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాళేశ్వరం అభివృద్ధికి 100 కోట్లు: సీఎం కేసీఆర్‌

kcr family

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వరం ఆలయాన్నిఅభివృద్ది చేసేందుకు రాబోయే బడ్జెట్‌లో 100 కోట్లు కేటాయిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మరో యాదగిరిగుట్టగా కాళేశ్వరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. కాళేశ్వరం ముక్తీశ్వరస్వామిని కేసీఆర్‌ దంపతులు ఈరోజు ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకుని స్వామి దర్శనం చేసుకున్నారు.

ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేదాశీర్వచనం పలికి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.సీఎం దంపతులతో పాటు మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్, సీఎస్ ఎస్కే జోషీ, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గోదావరి నదిలో సీఎం కేసీఆర్ దంపతులకు అర్చకులు సంకల్పం చెప్పారు.

Related posts