చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, కాలూరు, కుప్పం బాదూరు గ్రామాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పులివర్తివారి పల్లి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భార్య పులివర్తి సుధారెడ్డి ఈరోజు ఆందోళనకు దిగారు.
పోలింగ్ నిలుపుదల చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఓటేసేందుకు వృద్ధులకు సహాయకులుగా ఎవరినీ పీవోలు అనుమతించకపోవడంతో కుమారుడితో కలిసి ఆమె నిరసనకు దిగారు. చివరకు పోలిసులు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పడంతో సుధారెడ్డి ఆందోళన విరమించారు.